భద్రాచలం, తెలంగాణ 26 మార్చ్ 2025: పాత భవనంపై ఆరు అంతస్తులు.. అది కూడా 9 అంగుళాల పిల్లర్లతో భవన నిర్మాణం, దీంతో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద పడి ఆరుగురు మృతి చెందారని స్థానికులు చెప్తున్న సమాచారం. ఇంటి యజమాని కుటుంబసభ్యులు శిధిలాల కింద ఉన్నట్లు సమాచారం
పీఠం పేరుతో ఓ అర్చకుడు మఠం నిర్మించాలని భావించి.. అత్యాశకపోయి ఓ నాశిరకం నిర్మాణం చేయడంతో చోటు చేసుకున్న దుర్ఘటన. అమ్మవారి పేరుతో ఓ అర్చకుడు ఓ పాతభవనంపై మరో నాలుగు అంతస్థులు కొత్త భవనాన్ని నిర్మిస్తుండగా, గత ఏడాది పంచాయతీ సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించడంతో, అప్పటి నుంచి నిర్మాణం నిలిచిపోయింది, ఆ సమయంలో పంచాయతీ సిబ్బందితో సదరు వ్యక్తి దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పీఠం పేరుతో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడమే కాకుండా.. అమ్మవారి ఆలయాన్ని నిర్మించి.. ఆ ఆలయం పక్కనే ఈ అరు అంతస్థుల భవనాన్ని నిర్మించారు. ఒకవేల భవనం ప్రారంభోత్సవమై భక్తులు ఉండి ఉంటే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు









