అమరావతి ,డైలీ ఎకో360 -25 మార్చ్ 2025: సోషల్ మీడియా అరెస్ట్ లపై పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం. కోపం వస్తున్నా నియంత్రించుకుంటున్నాం అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డ ఏపీ హైకోర్టు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యంగ్యంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా?.అలా అయితే సినిమా హీరోలను, విలన్ లను కూడా అరెస్ట్ చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు.
తాజాగా గుంటూరుకు చెందిన ప్రేమ్ కుమార్ సోషల్ మీడియాలో గుంటలు పూడ్చాలి అంటే ఊరూరా టోల్ కట్టాల్సిందే అంటూ ఒక పోస్ట్ పెట్టాడు.. దీనిపై కర్నూల్ లో టీడీపీ నేత ఫిర్యాదుతో కర్నూల్ పోలీసులు గుంటూరుకు వెళ్లి ప్రేమ్ కుమార్ ను అరెస్ట్ చేశారు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ప్రేమ్ కుమార్ కొడుకు హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరగగా, కోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది . కర్నూల్ సీఐని ఈ కేసుల్లో స్పందించినంత వేగంగా మిగతా కేసుల్లో స్పందిస్తున్నారా? ఇప్పటి వరకు ఎన్ని కేసులను ఇలా మెరుపు వేగంతో విచారించారు అంటూ హైకోర్టు ప్రశ్నించింది.
రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను వ్యగ్యంగా విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేసే పనైతే , అలాంటివి చేసే ప్రతి సినిమా నటుడిని , విలన్ ను అరెస్టు చెయ్యాల్సి ఉంటుంది — ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు



ఇప్పటికైనా పోలీసుల తీరు మారుతుందా లేక పై అధికారుల మెప్పుకోసం ఇలానే ప్రవర్తించి , మల్లి హైకోర్ట్ వారి ఆగ్రహానికి గురిఅవుతారో లేదో చూడాలి అని పలువురి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు







