పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల అనుమానాస్పద మృతి

రాజానగరం (తూర్పుగోదావరి జిల్లా) 25 మార్చ్ 2025:

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొంతమూరు-దివాన్‌ చెరువు వెళ్లే ఫోర్త్‌ బ్రిడ్జి పెట్రోల్‌ బంక్‌ సమీపంలో రోడ్డు పక్కన విగత జీవిగా కనిపించారు. పక్కన ఆయన బుల్లెట్‌ వాహనం ఉంది. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి తన బుల్లెట్‌పై వస్తునండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన శరీరంపై గాయాలు ఉన్నాయి. హెల్మెట్‌ ధరించినా ముఖంపై కూడా తీవ్రమైన గాయాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రవీణ్‌ పలు టివి ఛానళ్లలో చర్చాగోష్టిలో వాదనలు గట్టిగా విన్పించడం ద్వారా పలువురికి టార్గెట్‌ అయ్యారని, తరచూ ఆయనకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ కూడా వచ్చేవని క్రైస్తవ సంఘాల నాయకులు చెప్తున్నారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో చాగల్లులో జరగనున్న క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు ప్రవీణ్‌ ఇక్కడకు వస్తున్నట్లు తెలిసింది. రాజమహేంద్రవరంలోని దివాన్‌ చెరువులోగల ఆయన విశ్రాంతి తీసుకొనే ఫ్లాట్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారా? లేదా ఎవరైనా దాడి చేసి హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. ఘటన స్థలాన్ని రాజానగరం పోలీసులు పరిశీలించి ప్రవీణ్‌ భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రవీణ్‌ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద పలు  క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఆయన మృతదేహాన్ని హోసన్న మినిస్ట్రీ నిర్వాహకులు జాన్‌ వెస్లీ, యంగ్‌ హోలీ టీమ్‌ నిర్వాహకులు జాన్‌ వెస్లీ, విజయకుమార్‌ రెడ్డి, మాజీ ఎంపి జివి.హర్షకుమార్‌, మహాసేన రాజేష్‌, దళిత నాయకులు అజ్జరపు వాసు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. ప్రవీణ్‌ మృతిపై అనుమానాల నేపథ్యంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, వాస్తవాలను వెల్లడించాలని వారు డిమాండ్‌ చేశారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

మృతదేహంపై గాయాలు ఉండటంతో, ఈ మరణం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. హెల్మెట్ ధరించినప్పటికీ ముఖంపై తీవ్ర గాయాలు ఉండడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసి, సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అంతేగాక, హోం మంత్రి అనిత కూడా ఈ కేసును లోతుగా పరిశీలించేందుకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం, పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, ఫోరెన్సిక్ నివేదికలు, మరియు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారిక దర్యాప్తు ద్వారా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల

Related Posts

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

అహ్మదాబాద్‌: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది.విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా…

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు లిక్కర్ స్కాం చుట్టూ తిరుగుతున్నాయి. విజయ సాయి రెడ్డి CID విచారణ ముందు, రహస్యం గా చంద్రబాబు బినామీగా , నమ్మిన బంటు గా ముద్ర పడ్డ TD జనార్దన్ కలవడం, ఆలా రహస్యం గా కలిసిన…

You Missed

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ

భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ