తిరుమల ,12-ఏప్రిల్-2025: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు పాదరక్షలతో ముగ్గురు భక్తులు చేరుకున్నారు. ఆ ముగ్గురుని విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులను గుర్తించకుండా తనిఖీ సిబ్బంది పంపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రంలో ఇటివలే భద్రత వైఫల్యం కనిపించింది. తిరుమలకు చేరుకున్న అన్యమత వ్యాఖ్యలతో కూడిన ఓ కారు కనిపించింది. సాధారణంగా అలిపిరి తనిఖీ కేంద్రంలో రాజకీయ పార్టీల చిహ్నాలు, అన్యమత చిహ్నాలు, ఫొటోలు అనుమతించరు. అయితే కారుపై అన్యమత వ్యాఖ్యలు ఉన్నాయి. అది తిరుమలకు చేరుకోవడంపై టీటీడీ తనిఖీ భద్రతా వైఫల్యాన్ని సూచిస్తుంది.
అలాగే కొద్దిరోజుల క్రితం, తిరుమల వసతి గృహం లో జంట ఆత్మహత్య, కొండ పై మాంసం తో కూడిన భోజనాలు చేయడం, మాడ వీధులలలో చెప్పులతో తిరగడం, వైకుంఠ క్యూ కంప్లెక్సులలో భకులమధ్య కొట్లాట, ఇలా చాల సంఘటనలు జరగడం పట్ల వెకన్నా స్వామి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా తనిఖీ కేంద్రం సిబ్బంది పటిష్ట తనిఖీలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.







