చిలకలూరిపేటలో మురళి మోహన్ చౌదరి అనే టీడీపీ కార్యకర్త(NRI)కి చెందిన కాంప్లెక్స్‌ను కబ్జా చేసిన టీడీపీ నాయకులు
టీడీపీ కోసం ప్రచారం చేసి, కస్టపడి ఆదివారం లోకి రావటానికి పనిచేసిన చిన్నపాటి లీడర్స్ ఆస్తులనే కాజేస్తున్న సొంత పార్టీనేతలు. చిలకలూరిపేట లో , మురళి మోహన్ చౌదరి కి చేసిన షాపింగ్ కాంప్లెక్స్ ని అధికారం లోకి వచ్చిన 2 నెలల్లో కబ్జాచేసి, అప్పటివరకు ఉన్నషాప్ వాళ్ళను బెదిరించి, కాంప్లెక్స్ లోకి కస్టమర్లను కూడా రాకుండా బెదిరించి, మున్సిపాలిటీ వాళ్లతో షాపింగ్ కాంప్లెక్స్ ముందు చెత్త వేయించి, ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ వేశారు అని మురళి ఆరోపిస్తున్నారు.
అలానే, ఈ విషయం లోకేష్ గారి దుష్టికి తీసుకెళ్లి , పరిష్కరిస్తాను అని మధ్య నాయకులూ చెప్తే, 22 లక్షలు పలు దఫాలుగా చెల్లించాను అని, కానీ ఇప్పటివరకు లోకేష్ గారిని కలవనీయలేదు అని, ఎమన్నా అడిగితే, మా అమ్మ నాన్నలను చంపేస్తాము అని బెదిరిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తూ , తన బాధను ఆధారాలతో సహా X లో పోస్ట్ చేసారు .
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, వాళ్లకు డబ్బు కావాలేమో అని, ఒక కోటి రూపాయలవరకు ఇస్తాను అని, ఆలా చెల్లించడానికి కోర్ట్ లో కూడా కేసు వేసాను అని, ఆలా డబ్బు తీసుకోవడానికి ఈ నాయకుడు ముందుకు రాలేదు అని చెప్తున్నాడు






అలానే ఈ మధ్య తిరుపతి లో కూడా తనకున్న కొద్దిపాటి ఇంటి స్థలం ని టీడీపీ నాయకులూ పోలీసులతో కలిసి కబ్జా చేసారని, పోలీస్ స్టేషన్ కి వెళ్తే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు అని, ఇంకా ఎక్కువ మాట్లాడితే, తిరిగి మీ మీదనే కేసు పెడుతాం అని బెదిరించారు అని, ఆస్ట్రేలియా- సిడ్నీ లో ఉంటున్న గోరా రాజేద్రప్రసాద్ నే NRI ఆవేదన వ్యక్తం చేసారు.
2019-24 మధ్య ఇలాంటి పరిస్థితి లేదు అని, అయినా, కూటమి అధికారం లోకి తీసుకురావడానికి అసత్య ప్రచారం చేసాం అని, ఇప్పుడు మేమె దానికి బాలి అయ్యాం అని NRI లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు







