జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర దాడి : 27 మంది మృతి

జమ్ముకశ్మీర్​లో పర్యటకులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు – 27 మంది మృతి- పదుల సంఖ్యలో క్షతగాత్రులు.

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందారు. పదుల సంఖ్యలో పర్యాటకులు గాయపడ్డారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న భద్రతాదళాలు ఘాతుకానికి ఒడిగట్టిన ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి.

అదే సమయం లో ప్రధాని మోడీ అధికారిక విదేశీయ పర్యటనలో భాగం గా దుబాయ్ లో వున్నారు. ప్రధాని మోదీ సూచన మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా శ్రీనగర్‌కు పయనమయ్యారు. ఇది ఇలా ఉండగా, కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు, మతం అడిగి , ముస్లిం కానీ వాళ్ళను మాత్రమే కాల్చారు అని బాధితులు చెప్తున్నారు

అమర్​నాథ్ యాత్రకు ముందు ఉగ్రదాడి

అమర్‌నాథ్‌ యాత్రకు పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయన్న సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పొడవైన పచ్చికబయళ్లతో ఆహ్లాదకర వాతావరణంతో మినీ స్విట్జర్లాండ్‌గా పేర్కొందిన పహల్గామ్‌లో కాల్పులకు తెగబడ్డారు. బైసరన్ లోయలోని పర్వతం పైనుంచి దిగివచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ముష్కరులు అతి సమీపం నుంచి పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. గాయపడినవారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. ఈ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 38రోజులపాటు కొనసాగే అమర్ నాథ్ యాత్ర జులై 3నుంచి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో అమర్‌నాథ్‌ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు. ఒకటి అనంత్ నాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48కిలోమీటర్ల దూరం ఉండగా, గందర్బల్ జిల్లా బాల్తాల్‌ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

అమిత్ షా తో ఫోన్​లో మాట్లాడిన మోదీ

సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ ఉగ్రదాడిని ఖండించారు. తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనాస్థలాన్ని సందర్శించాలని కేంద్రమంత్రికి సూచించారు. దీంతో ఆయన శ్రీనగర్‌కు పయనమయ్యారు. భద్రతా సంస్థలతో సమావేశమై శాంతిభద్రతలను సమీక్షించనున్నారు. జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా రాంబన్‌ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకొని శ్రీనగర్‌కు చేరుకున్నారు. అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రదాడిని జమ్ముకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

కశ్మీర్‌లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భద్రతాదళాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థ స్థానిక శాఖ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది.

ఉగ్రవాదం పై పోరుకు , భారత్ కు సంపూర్ణ మద్దత్తు: ట్రంప్

‘కశ్మీర్‌ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా మద్దతుగా ఉంటుంది. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని మోదీ, భారత దేశ ప్రజలకు మా పూర్తి మద్దతు ఉంటుంది’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

‘భారత్‌లోని పహల్గామ్‌లో వినాశకర ఉగ్ర దాడి ఘటనపై బాధిత కుటుంబాలకు నేను, ఉష సంతాపం ప్రకటిస్తున్నాం. కొన్ని రోజులుగా మేం ఈ దేశ సౌందర్యం, ఇక్కడి ప్రజల అభిమానానికి ముగ్ధులమయ్యాం. ఈ భయంకరమైన దాడి వల్ల దుఃఖంలో మునిగిపోయిన వారికి సంఘీభావం తెలుపుతున్నాం’ అని జేడీ వాన్స్‌ ట్వీట్‌ షేర్ చేశారు.

Related Posts

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

అహ్మదాబాద్‌: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది.విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా…

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు లిక్కర్ స్కాం చుట్టూ తిరుగుతున్నాయి. విజయ సాయి రెడ్డి CID విచారణ ముందు, రహస్యం గా చంద్రబాబు బినామీగా , నమ్మిన బంటు గా ముద్ర పడ్డ TD జనార్దన్ కలవడం, ఆలా రహస్యం గా కలిసిన…

You Missed

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ

భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ