విశాఖ-సింహాచలం: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి 8 మంది భక్తులు మృతి.
రాత్రి కురిసిన భారీ వర్షాలకు కూలిన సిమెంట్ గోడ.20 రోజుల క్రితమే గోడ కట్టిన ఏపీ ప్రభుత్వం.

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి జరిగింది. చందనోత్సవంలో భాగంగా, స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 8 మంది మృతిచెందగా, ఒకరు గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఇవాళ తెల్లవారుజామున సింహాచలంలో 3:30 గంటలకు ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం కురిసింది.
గాయపడిన ప్రవీణ్‌కుమార్(30)ను సిబ్బంది కాపాడి విమ్స్‌కు తరలించారు. ప్రవీణ్‌కుమార్‌కు అన్ని పరీక్షలు చేశామని విమ్స్ డైరెక్టర్ డా.రాంబాబు తెలిపారు. ప్రవీణ్‌కుమార్‌కు కాలి ఎముక విరిగిందని చెప్పారు. 8 మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పిల్లా మహేశ్(30) ఆయన భార్య శైలజ(29), శైలజ తల్లి పైలా వెంకటరత్నం(45), శైలజ మేనత్త జి.మహాలక్ష్మి(65) ఉన్నారు.
మరోవైపు హోం మంత్రి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంపై ఆలయ ఇంజినీరింగ్ అధికారుల నుంచి కలెక్టర్ నివేదిక కోరారు. కాంట్రాక్టర్ వివరాలు, గోడ నిర్మాణం, ఇతర వివరాలు పొందుపరచాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఘటన పై సీఎం చంద్రబాబు విచారం
చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు మృతిచెందడం కలచివేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారీ వర్షాల వల్ల గోడ కూలడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి అక్కడి పరిస్థితి తెలుసుకున్నానని వివరించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయచర్యలపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

సింహాచలం ఘోర ప్రమాదం పట్ల ప్రధాని దిగ్బ్రాంతి..
చనిపోయిన వారికి రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు సహాయం ప్రకటన.
ఘటన పై మాజీ సీఎం జగన్ విచారం
సింహాచలం చందనోత్సవం లో జరిగిన సంఘటన పట్ల మాజీ సీఎం వైస్ జగన్ విచారం వ్యక్తం చేసేసారు. మూతులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. అలానే గాయపడిన వారికీ మెరుగైన వైద్యం చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలను విశాఖ వెళ్లి పరామర్శిస్తారని పార్టీవర్గాలు తెలియజేసాయి.
గోడ ఎలా కట్టారో, ఎవరి హయాంలో కట్టారో విచారించి, చర్యలు తీసుకుంటాం: హోమ్ మంత్రి అనిత
ఈ నెల 27 న చందనోత్సవం పనులను స్వయం పరిశీలించిన హోమ్ మంత్రి, అయినా.. aa గోడ గోడ ఎలా కట్టారో, ఎవరి హయాంలో కట్టారో విచారించి, చర్యలు తీసుకుంటాం అని చెప్పడం , ఈ సంఘఠన జరిగిన అది గత ప్రభుత్వం వల్లనే జరిగింది అని చెప్పడానికి ప్రయత్నించినట్లుంది అని, విమర్శలకు దారితీసింది .
20 అడుగుల గోడ, ఎటువంటి భీములు, పిల్లర్లు లేకుండా, నాసిరకం ఇటుకలతో గోడ కట్టడం వల్లనే , చిన్న పాటి వర్షానికి కూలిపోయి, 8మంది మృతి చెందారు అని భక్తులు అంటున్నారు. అలానే, ఇలా నాసిరకం ఇటుకల తో గోడ కట్టిన కాంట్రాక్టర్ ని, అధికారులను షికిషాలని భక్తులు కోరుతున్నారు.

సింహాచలం ఘటనలో సాఫ్ట్వేర్ దంపతులు మృతి:
సింహాచలం ఘటనలో మృతి చెందిన వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న దంపతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని విశాఖపట్నంలోని మధురవాడ చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిల్లా ఉమామహేశ్వరరావు (30), శైలజ (26)గా నిర్ధరించారు. వీరు హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తూ ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు.








