జమ్ముకశ్మీర్లో తెలుగు జవాన్ మురళీనాయక్ మృతి. పాక్ కాల్పుల్లో మృతి చెందిన జవాన్ మురళీ నాయక్.
మురళీనాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా కల్లి తండా… నేడు (10/05/2025) స్వస్థలానికి మురళీనాయక్ మృతదేహం.
వీర జవాన్ మురళీ నాయక్ మరణవార్త విని గుండెలవిసేలా రోదిస్తున్న కుటుంబసభ్యులు.వీర జవాన్ మురళీ నాయక్ ఇంటి వద్ద అలుముకున్న విషాదఛాయలు

నేను చనిపోయినప్పుడు, నా దేహం మీద జాతీయ జెండా కిందలి – మురళి మేనమామ
చనిపోతే దేశం కోసం చనిపోతా, చనిపోయాక నా మృతదేహం మీద జాతీయ జెండా ఉండాలని మురళీ నాయక్ తరచూ చెప్తూ ఉండేవాడు. నా మేనల్లుడు దేశం కోసం పోరాడి వీరమరణం పొందినందుకు గర్వపడుతున్నాను.నా ఇద్దరు కొడుకులను కూడా దేశం కోసం పోరాడడానికి పంపిస్తాను
పాకిస్తాన్ ఉగ్రవాదులను రెండు రోజులలో పూర్తిగా హతమార్చాలని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.
మురళి కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం YS జగన్
జమ్మూ కాశ్మీర్లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్
కుటుంబ సభ్యులను పరామర్శించి చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించిన మంత్రి సవిత
ఘటన బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా
అనంతరం రూ.5లక్షల చెక్కును అందజేసిన మంత్రి సవిత
అలాగే వీర జవాన్ మురళి నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించిన సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్
వైయస్ జగన్ మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ మీకు నేను ఉషమ్మ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు







