టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

అహ్మదాబాద్‌: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది.
విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. విమాన పైలెట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్​కు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉన్నట్లు తెలిపారు. ఎయిర్​ఇండియా B787 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఘటన జరిగింది.

అహ్మదాబాద్​లోని మేఘనినగర్ ప్రాంతానికి సమీపంలోని ధార్పూర్ వద్ద ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం విమానం నుంచి భారీ పొగలు రావడంతో అటు ఎయిర్​ఇండియా, ఇటు ఎయిర్​పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టాయి.
ఎయిర్​ ట్రాఫిక్ కంట్రోల్​(ఏటీసీ) అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు రన్‌వే 23 నుంచి బయలు దేరింది. కొద్ది సేపటి తర్వాత విమానం ఏటీసీకి అందుబాటులోకి రాలేదు. విమానం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఎయిర్​పోర్టు సమీపంలోనే విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.

ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు, కేబిన్ లోని వీడియో

మెడికల్ కాలేజ్ హాస్టల్​పై కూలిన విమానం- పలువురు విద్యార్థులు మృతి!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఓ మెడికల్ కాలేజ్​ హాస్టల్​పై కూలింది. దీనితో పలువురు వైద్య విద్యార్థులు మరణించినట్లు, మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే విమానం కూలినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, ఫ్లైట్ సిబ్బంది ఉన్నారు.

ఎయిర్​ ఇండియా విమాన ప్రమాదంపై AAIB దర్యాప్తు
అహ్మదాబాద్​లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్​క్రాఫ్ట్​ యాక్సిడెంట్​ ఇన్వెస్టిగేషన్​ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.

ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా డ్రీమ్​లైనర్ బోయింగ్​ 787 విమానంలో 12 మంది సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

‘ఏఏఐబీ డెరెక్టర్ జనరల్​, ఏజెన్సీలోని ఇన్వెస్టిగేషన్ డైరెక్టరర్​ సహా ఇతర అధికారులు ఇప్పుడు అహ్మదాబాద్​ బయలుదేరుతారు’ అని సదరు అధికారి తెలిపారు.

పౌర విమానయాన మంత్రిత్వశాఖ కింద పనిచేసే ఏఏఐబీ – భారత గగనతలంలో ప్రయాణించే విమానాల భద్రతకు, అలాగే ఇండియన్ ఎయిర్​ స్పేస్​లో జరిగే విమాన ప్రమాదాలకు, తీవ్రమైన ఘటనలకు బాధ్యత వహిస్తుంది. వాటిపై సమగ్ర దర్యాప్తు చేస్తుంది. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతను మెరుగుపరిచేందుకు తగిన చర్యలను సూచిస్తుంది.

‘విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలు మాకు అందాయి. మరింత సమాచారం సేకరించడానికి మేము కృషి చేస్తున్నాం’ అని బోయింగ్​ ఒక ప్రకటనలో తెలిపింది.

‘మాటలకందని ఘోర విషాదం’- విమాన ప్రమాదంపై ముర్ము, మోదీ, రాహుల్, జగన్

Related Posts

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు లిక్కర్ స్కాం చుట్టూ తిరుగుతున్నాయి. విజయ సాయి రెడ్డి CID విచారణ ముందు, రహస్యం గా చంద్రబాబు బినామీగా , నమ్మిన బంటు గా ముద్ర పడ్డ TD జనార్దన్ కలవడం, ఆలా రహస్యం గా కలిసిన…

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణ. కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పందం. ఈరోజు మధ్యాహ్నం 03:35 గంటలకు ఇండియన్ డీజీఎంవోతో చర్చలు జరిపిన పాకిస్తాన్ డీజీఎంవో. భారత్ – పాక్‌ల యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ.. అమెరికా…

You Missed

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ

భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ