నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలో ఘోరం జరిగింది. కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు. హనుమాన్ నగర్ కాలనీలో ఉంటున్న హుస్సేన్ బాషా, ఆశ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్న కుమారుడు మోహిద్దీన్ (4) పై వీధి కుక్కలు దాడి చేయడంతో మృతి చెందాడు. పసిబాలుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు.వీధి కుక్క ల బెడద ఎక్కువైంది అని ఎన్నిసార్లు మున్సిపల్ ఆఫీసర్స్ కి చెప్పిన పట్టించుకోవడం లేదు అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు







