హైదరాబాద్-రాయదుర్గం, మే 9: మత్తు పదార్థాలకు బానిసగా మారిన మహిళా డాక్టర్,.. ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ.. షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ అపార్ట్మెంట్ తన నివాసం లో దొరికిన డాక్టర్.డ్రగ్ డీలర్ల తో నేరుగా వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెట్టి , ఈ ఏడాదిలో రూ.70 లక్షల విలువ చేసే కోకైన్ను కొనుగోలు చేసిన వైద్యురాలు . అలానే ఈసారి 5లక్షల విలువైన 5౩గ్రాముల కొకైన్ కొనుగోలు చేసి, పోలీసులకు దొరికిపోయింది.వైద్యురాలితో పాటు, డెలివరీ చేసిన వ్యక్తిని జూబిలీహిల్స్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్, ఒమేగా హాస్పిటల్ సీఈవో చిగురుపాటి నమ్రత గా తెలుస్తుంది.
ఈ కేసుకు సంబధించిన వివరాలను , రాయదుర్గం ఇన్స్పెక్టర్, CH వెంకన్న మీడియాకు వెల్లడించారు.
షేక్‌పేట్‌లోని అపర్ణ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న యువ వైద్యురాలు, తరచూ ముంబై వెళ్లి వస్తూవుండేది అని, ఆలా వెళ్లే క్రమం లో , ఒక పబ్ లో పనిచేస్తున్న డీజే పరిచయం అయ్యాడు అని, మొదట ఆ డీజే ద్వారా డ్రగ్స్ కి అలవాటు పడింది అని, తరువాత డ్రగ్ డీలర్ వంశ టక్కర్ తో నేరుగా కొనుగోలు చేస్తుంది అని, ఏడాది కలం లో 70లక్షల విలువైన డ్రగ్స్ కొనుగోలు చేసింది అని, ఆ క్రమం లో ఈ సరి 5లక్షల విలువైన 53గ్రాముల కొకైన్ కొనుగోలు చేస్తూ పట్టుబడింది అని తెలిపారు . ఆ డ్రగ్ డీలర్ వంశ్ తో ఒక వాట్సాప్ గ్రూప్ వుంది అని, ఆ గ్రూప్ లో ప్రముఖులు, వారి పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించం అని, వారిని విచారిస్తాం అని తెలిపారు.






