విశాఖ నుంచి కీలక విమాన సర్వీసులు నిలిపివేత, ఆందోళనలో ప్రయాణికులు

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన విశాఖలో విమానయానానికి పూర్వ వైభవం వస్తున్న తరుణంలో ఇక్కడి నుంచి కీలక సర్వీసులు నిలిచిపోనున్నాయి. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడకు రెండు సర్వీసులు ఇప్పటికే నిలిచిపోగా మేలో బ్యాంకాక్‌ (థాయ్‌లాండ్‌ థాయ్ ఎయిర్వేస్ ), కౌలాలంపూర్‌ (మలేసియా ఎయిర్ ఆసియా) సర్వీసులూ రద్దు కానున్నాయి. కొవిడ్‌ సమయంలో నిలిచిపోయిన దుబాయి సర్వీసు ప్రారంభం కాకపోగా ఉన్నవీ రద్దు కావవడంతో స్థానిక పారిశ్రామికవేత్తలు, నాయకులు, వివిధ వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పెరిగిన అంతర్జాతీయ ప్రయాణికులు రద్దీ: గణాంకాలను చుస్తే, గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 74.4 శాతం పెరిగింది. 8,415 మంది మలేసియా, కౌలాలంపూర్, సింగపూర్‌కు రాకపోకలు సాగించారు. తాజాగా మే మొదటి వారం నుంచి ఈ సర్వీసులకు టికెట్ల బుకింగ్‌ నిలిపివేశారు. ఇక్కడి నుంచి ఉమ్మడి విశాఖతోపాటు తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోతే వారంతా హైదరాబాద్, చెన్నై వెళ్లి అక్కడి నుంచి బ్యాంకాక్, మలేసియాలకు ప్రయాణించాలి.

కూటమి ప్రభుత్వం వచ్చాక , విశాఖ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, అంట అమరావతి అని ప్రచారం చేయడం, ఇప్పటికే పలు సంస్థ లను , అమరావతి గ్రామాలకు తరలించడం వల్లనే, ప్రయాణికులు తగ్గారని , ఆ కారణం చేతనే, దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసెస్ ని రద్దు చేస్తున్నారు అని , ఇలా అయితే వేళా కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిరుపయోగం అవుతుంది అని పలువురు నిపుణులు అభిప్రాయం పడుతున్నారు

విజయవాడకు ఒక్కటే సర్వీసు: ఇది ఇలా ఉంటే, విశాఖ, విజయవాడ మధ్య రాకపోకలు పెరిగిన నేపథ్యంలో గతేడాది అక్టోబరులో రెండు కొత్త సర్వీసులు ప్రారంభించారు. దీంతో ప్రతిరోజు నేరుగా విజయవాడ వెళ్లేందుకు ఉదయం 2, సాయంత్రం ఒక సర్వీసు అందుబాటులో ఉండేవి. తాజాగా ఉదయం సర్వీసులు రద్దయ్యాయి. మిగిలిన రోజుల్లో విజయవాడకు రాకపోకలు సాగించేందుకు వందే భారత్‌ రైలు అందుబాటులో ఉంది. మంగళవారాల్లో వందేభారత్‌ కూడా లేకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు విజయ్‌మోహన్, నరేశ్‌కుమార్‌ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Related Posts

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

అహ్మదాబాద్‌: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది.విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా…

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు లిక్కర్ స్కాం చుట్టూ తిరుగుతున్నాయి. విజయ సాయి రెడ్డి CID విచారణ ముందు, రహస్యం గా చంద్రబాబు బినామీగా , నమ్మిన బంటు గా ముద్ర పడ్డ TD జనార్దన్ కలవడం, ఆలా రహస్యం గా కలిసిన…

You Missed

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ

భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ