భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ
గురువారం రాత్రి, దాదాపు 400 డ్రోన్లతో సియాచిన్ (లద్దాక్) నుంచి కచ్(GJ) వరకు 36 ప్రాంతాల టార్గెట్ చేస్తూ వీటిని లాంచ్ చేశారని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
వాటన్నింటినీ నాశనం చేసినట్లు.. ఈ డ్రోన్లకు కెమెరాలను ఫిక్స్ చేశారని, ఇక్కడి సమాచారాన్ని సేకరించేలా పాక్ ఇలా పన్నాగం పన్నినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి
భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు తుర్కియే దేశం ఇచ్చింది
నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300-400 వరకు డ్రోన్లతో దాడి జరిగింది.. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులో తేలింది
ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్, నాన్ కైనెటిక్స్ సాధనాలతో ఈ డ్రోన్లను నాశనం చేశాం
అలాగే పాకిస్తాన్ మిస్సైల్ దాడి కూడా చేసింది.. దాన్ని గుర్తించి నాశనం చేశాం అని కల్నల్ సోఫియా ఖురేషి చెప్పారు
భారత్ చేసిన సాయం మరిచి శత్రు దేశానికి సాయం చేసిన టర్కీ/తుర్కియే

2023 సంవత్సరంలో భూకంపం వచ్చి తీవ్రంగా నష్టపోయిన టర్కీ దేశానికి ఇండియన్ ఆర్మీని పంపి ఆపరేషన్ దోస్త్ పేరిట 8,45,590 డాలర్ల విలువైన సామగ్రి దేశం అందించి రక్షణ చర్యలు చేసి ఎంతో సహాయం అందించింది
ఆపదలో సహాయం చేసిన మిత్రుడిని మరిచిన టర్కీ దేశాధినేతలు నీతి మాలిన చర్యలకు పాల్పడి మిత్రద్రోహం చేసారు
గురువారం భారత్ మీద దాడి చేయడానికి పాకిస్తాన్కు 400 డ్రోన్లు యుద్ధ సామాగ్రి అందించారు
భారత్ పై దాడిలో బాగంగా పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు అన్నీ టర్కీ/తుర్కియే దేశానికి చెందినవిగా ఇండియన్ ఆర్మీ గుర్తించారు






