వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: వక్ఫ్ సవరణ బిల్ పై సుప్రీమ్ కోర్ట్

వక్స్ చట్టంపై దాఖలైన పిటిషన్ల తొలిరోజు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ. మరో 71 పిటిషన్లూ దాఖలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైన వక్స్(సవరణ) చట్టం,2025 ను సవాల్ చేస్తూ దాఖ లైన పిటిషన్ల విచారణ తొలిరోజే సర్వోన్నత న్యాయ స్థానం పిటిషనర్లకు కాస్తంత ఊరట కల్గించేలా వ్యా ఖ్యానించింది. సుదీర్ఘకాలంగా ముస్లిం మత, దాతృ త్వ కార్యక్రమాలతో సంబంధముండి వక్స్ ఆధీనం లో ఉన్న ఆస్తులను(వక్స్ బై యూజర్) ఇకమీదటా వక్స్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమా ర్, జస్టిస్ కేవీ విశ్వ నాథన్ ల త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు ధర్మా సనం వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఆ దిశగా ఉత్త ర్వులు, ఆదేశాలు ఇవ్వడానికంటే ముందు ఈ పిటిష న్లపై పూర్తిగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం కోరిం ది. “ ఆస్తులు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వర్ఫ్ అధీనంలో ఉన్నాయా? రిజిస్ట్రర్ డాక్యుమెంట్లతో వర్ఫ్ కు దఖలుపడ్డాయా? అనేది తేలకుండానే ‘వక్స్ బై యూజర్’ అనే నిబంధనను తొలగించలేం. ఎక్స్- అఫీషియో సభ్యులు మినహా వక్స్ బోర్డులు, సెం ట్రల్ వక్స్ కౌన్సిల్లలో అందరూ ముస్లింలే సభ్యులుగా ఉండాలి” అని ధర్మాసనం స్పష్టంచేసిం
ది.

వక్స్ (సవరణ)చట్టం చట్టబద్ధతను సవాల్చేస్తూ దాఖలైన డజన్లకొద్దీ పిటిషన్లను బుధవారం విచారిం చడం మొదలెట్టాక తొలుత వీటిని హైకోర్టుకు బద లాయించాలని సుప్రీంకోర్టు భావించింది. అయితే ఈ ఆలోచనపై పిటిషన్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్, హుజేఫా అహ్మదీ, వైఎస్సార్సీపీ తరఫున వాదించిన ఎస్.నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తంచే శారు. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావంచూపగల ఈ కేసులను సుప్రీంకోర్టులోనే విచారించాలని కపిల్ సిబల్ గట్టిగా వాదించారు. తర్వాత కోర్టు కేసును గురువారం మధ్యాహ్నానికి వాయిదావేసింది.

ఆనాటి ఆస్తులకు పత్రాలుంటాయా?
వక్స్ ఆస్తిగా నమోదుచేయాలంటే వాటి డాక్యుమెం ట్లు కచ్చితంగా సమర్పించాలంటూ చట్టంలోని సెక్షన్ 2ఏలో పేర్కొనడంపై సీజేఐ జస్టిస్ ఖన్నా అభ్యం తరం వ్యక్తంచేశారు. “ ఢిల్లీలోని జామా మసీదునే ఉదాహరణగా తీసుకుందాం. వందల ఏళ్లుగా వాళ్ల అధీనంలో ఉన్న ఇలాంటి పాత ఆస్తులకు రిజిస్టర్ చేయాలంటే ఇప్పుడు డాక్యుమెంట్లు తీసుకురమ్మం టే ఎలా?. అలాంటి ఆస్తులకు డాక్యుమెంట్లు వాళ్ల దగ్గర ఉంటాయా? ” అని సీజేఐ.. కేంద్రం తరఫున
హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. గతాన్ని మీరు మార్చలేరు అని కేంద్రా నుద్దేశించి వ్యాఖ్యానించారు. “ వర్ఫ్ ఆస్తుల్లో కొన్ని దుర్వినియోగం అయిన మాట వాస్తవమే. అం తమాత్రాన దాన్ని సాకుగా చూపి ‘వక్స్ బై యూజ్’ నిబంధనను తొలగిస్తామంటే కొత్త సమస్యలొ స్తాయి. వర్ఫ్ బై యూజర్ను కోర్టులు గతంలోనే ధృ వీకరించాయి. కోర్టు తీర్పులు, ఉత్తర్వులు, నిర్ణయా లను ప్రభుత్వాలు నిర్ణయించకూడదు. మీరు కేవలం ప్రాతిపదికను మాత్రమే పరిగణనలోకి తీసుకోవా లి” అని కేంద్రాన్ని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానిం చింది. వర్ఫ్ చట్టం తమకొద్దని చాలా మంది ముస్లిం లు చెబుతున్నారని తుషార్ మెహతా చెప్పగా కోర్టు కలుగజేసుకుని ” అయితే మీరు హిందూ దాతృత్వ ట్రస్టుల్లోనూ ముస్లింలను సభ్యులుగా చేరుస్తామని చెప్పదల్చుకున్నారా?” అని సూటి ప్రశ్న వేసింది. ” వర్ఫ్ చట్టంపై ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ 38 సార్లు సమావేశమైంది. ఏకంగా 98.2 లక్షల మెమోరండంలను కమిటీ పరిశీలించింది. తర్వాతే పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందింది” అని మెహతా చెప్పుకొచ్చారు. దీంతో సీజేఐ స్పందించారు. “ ఇక్కడ రెండు విషయాలు తేలాలి. ఈ కేసులన్నింటినీ హైకోర్టుకు బదలాయిం చాలా? లేదంటే అసలు మీరు సుప్రీంకోర్టు ద్వారా ఏం ఆశిస్తున్నారు? ఏం వాదించాలనుకుం టున్నారు? అంటూ కేంద్రంంతోపాటు పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారు. వాటికి సమాధానం చెప్పాలని ఆదేశించారు. చట్టంపై ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం ఆందోళనకరం. ఓవైపు ఈ అం శం కోర్టుల పరిధిలో పరిశీలనలో ఉండగా మరోవైపు ఆందోళనలు, హింస చెలరేగడం తీవ్ర ఆందోళన కల్గి స్తోంది” అని అన్నారు. వెంటనే తుషార్ మెహతా
కలుగజేసుకుని “ఇలా ఆందోళనలు చేయడం ద్వారా వ్యవస్థపై వాళ్లు తీవ్రమైన ఒత్తిడిని తేద్దామని చూస్తు న్నారు” అని వ్యాఖ్యానించారు. ” ఎవరు ఎవరిపై ఒత్తిడి తెస్తున్నారు? మాకైతే అర్థంకావట్లేదు” అని సిబల్ బదులిచ్చారు. ” సానుకూల అంశాలపైనా చర్చిద్దాం” అని సీజేఐ వ్యాఖ్యానించారు.

ఏ ప్రాతిపదికన ముస్లింగా నిర్ధారిస్తారు?
పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్ వాదించారు. ” నేను ముస్లింనా కాదా అనే విషయాన్ని ఏ రకంగా కేంద్రం నిర్ధారిస్తుంది?. ఇతను వక్క ఆస్తిని, ఇతరత్రాలను దానంగా ఇవ్వడానికి అర్హుడు అని కేంద్రం ఎలా నిర్ధారించుకుంటుంది?. గత ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్న వాళ్లే దానం ఇవ్వాలని చెప్పే హక్కు కేం ద్రానికి ఎక్కడిది?” అని కోర్టులో సిబల్ వాదిం చారు. దశాబ్దాలుగా ఆచరణలో ఉన్న ‘వర్ఫ్ బై యూజర్ ‘ ను
ఏకపక్షంగా తొలగించకూడదని లాయర్ హుజేఫా అహ్మదీ కోరారు. వైఎస్సార్సీపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమియత్ ఉలేమా-ఇ- హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ, సమస్థ కేరళ జమి యతుల్ ఉలేమా, అంజుమ్ ఖదారీ, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మొహమ్మద్ షఫీ, మొహమ్మద్ ఫజుల్గ హీమ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్కుమార్ ఝా, డీఎంకే, కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాపఢీ, మొహమ్మద్ జావేద్, తదితరులు మొత్తంగా 72 పిటిషన్లను వక్స్ చట్టాన్ని సవాల్చేస్తూ దాఖలు చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీచేయకుండా ముందస్తుగా కేంద్రం ఏప్రిల్ 8వ తేదీన కెవియట్ పిటిషన్ దాఖలుచేసింది. దీంతో పటిషన్ల విచారణ మొదలుకాకుండానే సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి తాత్కాలిక ఉత్తర్వులురాకుండా అడ్డుకోగలిగింది.

Related Posts

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

అహ్మదాబాద్‌: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది.విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా…

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు లిక్కర్ స్కాం చుట్టూ తిరుగుతున్నాయి. విజయ సాయి రెడ్డి CID విచారణ ముందు, రహస్యం గా చంద్రబాబు బినామీగా , నమ్మిన బంటు గా ముద్ర పడ్డ TD జనార్దన్ కలవడం, ఆలా రహస్యం గా కలిసిన…

You Missed

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ

భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ