తిరుమల -తిరుపతి , 11-ఏప్రిల్-2025: టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయి,గత 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు చనిపోయాయి. కానీ కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెట్టేసింది
శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రియమైన గోవుల సంరక్షణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది అని, టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయి అని,గత 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు చనిపోయాయి. కానీ కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెట్టేసింది అని సంచలన విషయాలను , ఫొటోలతో సహా ఈరోజు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు, వెంకన్న స్వామి భక్తులకు మీడియా సమావేశం ద్వారా చూపించారు.




తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో మహాపాతకం జరుగుతున్నా.. మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం అని, తిరుమల పవిత్రత కాపాడటమే ధ్యేయం అని చెప్పిన పవన్‌కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు , ప్రస్తుత టీటీడీ చైర్మన్ BR నాయుడు గారు ఎం చేస్తున్నారు అని అయన ప్రశ్నించారు.
గత మూడు మాసాలుగా గోశాలలో 100కుపైగా గోమాతలు మృత్యువాత పడుతుంటే ఆ విషయాన్ని దాచిపెట్టారు. పవిత్ర పుణ్యక్షేతంలో టీటీడీ నడిపే గోశాలలో గోవుల దుస్థితి చూడండి. గోవులు ఎందుకు చనిపోతున్నాయో కూడా తెలియదు..టీటీడీ అధికారులు పర్యవేక్షణే లేదు. రాష్ట్ర అధినేతలకు ఊడిగం చేయడానికే కొందరు టీటీడీ అధికారులకు సమయం సరిపోతోంది.
శ్రీవేంకటేశ్వరునికే ఆహారాన్ని అందించిన తల్లి గోమాత. అలాంటి గోవు పట్లే ఈ ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది.
స్వామి సుప్రభాత సేవలో నిత్యం ఆవు పాలతో చేసిన వెన్న నివేదిస్తారు. అలాంటి ప్రత్యేకత ఉన్న గోవులకు టీటీడీ సంరక్షణలో ఉన్న గోమాతకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంతా కాదు. మా పాలనలో దాదాపు 550 నాణ్యమైన దేశీయ ఆవులను గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ నుండి దాతల ద్వారా సమీకరించి టీటీడీకి తెచ్చాం. స్వామివారి కైంకర్యాలకు ఈ ఆవుల పాలనే వినియోగించాం. వాటి సంరక్షణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నాం. వాటి సంతానం దుస్థితి నేటి ప్రభుత్వంలో ఇలా ఉంది. మా పాలనలో రోజుకు 1,500 లీటర్ల పాలు సమీకరించాం. నేడు 500 లీటర్లు కూడా గోశాల నుంచి కొండకు తరలి వెళ్లని దుస్థితి దాపురించింది. ఈ ప్రభుత్వంలో పర్యవేక్షణే కరువైంది. చెత్త వేసినట్టు గోమాతలకు గ్రాసాన్ని వేస్తున్నారు.
టీటీడీ గోశాలలో ఉన్న ఎంతో ప్రత్యేకమైన ముఖ్యమైన సాహీవాల్ ఆవు..పైగా సూడిది గోశాల నుండి తప్పించుకుంది. చివరకు ఆ గోవు కడుపులో బిడ్డతో సహా రైల్వే ట్రాక్‌పై మరణించింది. టీటీడీ గోవుల చెవులకు ట్యాగ్ లు ఉంటాయి. అది టీటీడికి చెందిన గోవు అని తెలియకుండా ఉండాలని చెవులు కత్తిరించేశారని తెలుస్తోంది.
-భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ ఛైర్మన్
తిరుమల టీటీడీ గోశాల గోవుల మృతి ఘటనపై ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆవేదన
గత మూడు మాసాలలో టీటీడీ గోశాలలో సుమారు 100 గోవుల మృతి చెందిన విషయంపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. హిందువులు గోవులను తల్లిగా భావించి ‘గోమాత’ అని పిలుస్తారు. అలాంటి గోవులు ఇలాంటి దయనీయ స్థితిలో ఉండటం ఎంతో క్షోభను కలిగిస్తోందని తీవ్ర ఆవేధన వ్యక్తం చేస్తూ, ఈ చర్యలను ఖండించారు. ఈ ఘటనతో @TTDevasthanams గోశాల నిర్వహణ ఎలా ఉంధో నిరూపితమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది మొదలు అస్తవ్యస్త పాలనతో రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాకుండా నోరులేని గోవులకు కూడా ఇలాంటి దుస్థితి పట్టిందన్నారు. తక్షణమే గోవుల మరణంపై లోతైన విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. గోశాలలోని గోవుల పట్ల నిర్లక్ష్యం ఏమాత్రం సహించరానిదని ఎంపీ స్పష్టం చేశారు.







